జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2025
BSBNEWS - KANDUKUR
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2025 లో భాగంగా కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ ఐఏఎస్ 36 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల బ్యానర్ ను కందుకూరు ఆర్టీవో టీ వీ ఎన్ లక్ష్మీ ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆర్టీవో టీవీఎన్ లక్ష్మీ మాట్లాడుతూ నేటి 2025 సంవత్సర రహదారి భద్రత మాసోత్సవాల స్లోగన్ ను "రహదారి భద్రత ప్రచారం- శ్రద్ధ వహించండి" గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయటం జరిగిందన్నారు. ఈ యొక్క రహదారి భద్రత మహోత్సవాలు 2025 జనవరి 16 నుండి 2025 ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయని తెలియజేశారు. అనంతరం ఇందులో భాగంగా ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, కందుకూరు పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి తగు నివారణ చర్యలు కొరకు చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పి శ్రీ సి హెచ్ వి బాలసుబ్రమణ్యం, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాంబాబు, కందుకూరు సిఐ కె వెంకటేశ్వర్లు, కావలి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీబాయి, కందుకూరు టౌన్ ఎస్.ఐ వి.సాంబశివరావు, రూరల్ ఎస్సై బీబీ మహేంద్ర, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.