సిపిఎం ఆంధ్రప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని సిపిఎం కార్యాలయం నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1,2,3 తేదీలలో నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ ఎ గౌస్ మాట్లాడుతూ నెల్లూరులో జరుగునున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా 3-2-25 సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి ప్రదర్శన మొదలవుతుందని, సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ బహిరంగ సభలో కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ఎం ఏ బేబీ, కామ్రేడ్ బి వి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ ప్రదర్శన, బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఎం కందుకూరు పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ముప్పరాజు కోటయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ ఏ గౌస్, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ మున్వర్ సుల్తానా, సిపిఎం మాజీ కౌన్సిలర్ నాదెండ్ల కోటేశ్వరావు, కామ్రేడ్ మల్లికార్జున, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎస్ కే మల్లికా, ఎం పద్మ, ఎస్ పవన్ కుమార్, డి ఎం రాయుడు తదితరులు పాల్గొన్నారు.