ఫిబ్రవరి 3న నెల్లూరులో జరిగే సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
BSBNEWS - వలేటివారిపాలెం
ఫిబ్రవరి 1,2,3 తేదీలలో నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ నుండి భారీ ర్యాలీ అనంతరం విఆర్సి హై స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందని సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్ తెలిపారు. ఈనెల 19వ తేదీన నెల్లూరులో ప్రారంభమైన ప్రచార జాత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వలేటివారిపాలెం చేరింది. బస్టాండ్ సెంటర్ లో సిపిఎం ప్రచార జాతా ను ఉద్దేశించి సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు, ఎం ఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్, రాష్ట్ర నాయకులు పి మధు తదితరులు పాల్గొని ఉపన్యసిస్తారని తెలిపారు. ఈ ర్యాలీ బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. అందుకోసం గత పాలకులు బటన్ నొక్కుడు తప్ప రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టలేదు. మేం అధికారంలోకొస్తే ప్రజలపై భారాలను వేయం, మన రాష్ట్రానికి రాజధానిని నిర్మిస్తాం, పారిశ్రామికంగా అభివృద్ధిని సాధిస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, విశాఖ ఉక్కు ను ప్రైవేట్ పరం కానివ్వం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పారని గుర్తు చేశారు. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలల గడిచిందని పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రజలపై భారాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయని అన్నారు. మొదటగా నిరుద్యోగులు మెగా డీఎస్సీ వేస్తాం అని చెప్పిన హామీ నేటికీ అమలకు పూనుకోలేదన్నారు. యిలా ఉంటే ప్రభుత్వంపై విశ్వాసం సన్న గిల్లుతుందని అన్నారు. మెజారిటీ గా ఉన్న సామాన్య ప్రజల సమస్యలను విస్మరించి, కొద్దిమంది కార్పొరేట్ సంస్థల సేవలో తరించటం సరికాదని తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తారని తెలిపారు.ఈ మహాసభలకు రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన 570 మంది ప్రతినిధులకు హాజరవుతున్నారని, మూడు రోజులపాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను చర్చించి, ఉద్యమాలను రూపకల్పన చేస్తారని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచార జాత కార్యక్రమంలో సిపిఎం వలేటివారిపాలెం మండల కార్యదర్శి మాదాల రమణయ్య, మండల నాయకులు దార్ల మాధవరావు, కే మాలకొండయ్య, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, శ్రీకాంత్ వేణు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.