కందుకూరులో కార్డెన్ సెర్చ్
37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
BSBNEWS - కందుకూరు
కందుకూరు పట్టణం కేసరిగుంట కాలనీలో కందుకూరు డిఎస్పి సిహెచ్.వి.బాలసుబ్రమణ్యం పర్యవేక్షణలో ఇద్దరు సిఐలు, ఐదు మంది ఎస్సైలు, 55 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని కందుకూరు పట్టణ ఎస్సై వి సాంబశివయ్య తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరు డిఎస్పి మాట్లాడుతూ ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో సరైనటు వంటి ఆధార పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను మరోసారి వాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తరచు ఇలాంటి కార్డెన్ అండ్ సెర్చ్ లు ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆపరేషన్లు కందుకూరు సిఐ కే. వెంకటేశ్వరరావు, గుడ్లూరు సిఐ మంగారావు, కందుకూరు సబ్ డివిజన్ లోని ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.