తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
భారీగా హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
BSBNEWS - కందుకూరు
కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం 2025 నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయం నాయకులు కార్యకర్తలు, కూటమి నేతలు అభిమానులతో జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2025 నూతన సంవత్సర వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తో కలసి అత్యంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేసి కందుకూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. నూతన సంవత్సర సందర్భంగా కందుకూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్లమెంట్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.