భవిష్యత్తు కోసం ఇంటర్ దశ నుంచే విద్యార్థులకు ప్రణాళిక ఉండాలి

bsbnews
0

 భవిష్యత్తు కోసం ఇంటర్ దశ నుంచే విద్యార్థులకు ప్రణాళిక ఉండాలి

BSBNEWS - కందుకూరు 





బుదవారం పట్టణంలోని శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఆవరణలో కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కెరియర్ గైడ్లైన్స్ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కే ఎల్ యూనివర్సిటీ జోనల్ హెడ్ కృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తు కోసం ఇంటర్ దశ నుంచే విద్యార్థులకు ప్రణాళిక ఉండాలి అని, నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి అని, అలాంటి వాడే కొలువులకు ఎంపిక అవుతూ తక్కువ వయసులోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారన్నారు. కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీలో ఉపకార వేతనాలు అందిస్తున్నామని, కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేరకు ఎయిడ్స్ స్కాలర్షిప్ రూపంలో రాయితీలు కల్పిస్తున్నము అని కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా జె. శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకు సాగినప్పుడు భవిష్యత్తులో బంగారు బాట ఏర్పడుతుందని అన్నారు. అందుకు గాను కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పిస్తున్నావని, ప్రపంచంలోనే అనేక ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకొని, అత్యుత్తమ విద్యను, విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ, 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నామని కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా జె. శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ మొదటి సెమిస్టర్ చదువుతున్న మా విద్యార్థిని బి. లక్ష్మీ శైలజకు 58 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో గూగుల్ కంపెనీకి ఎంపిక అయిందని, ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న మరో 7 గురు విద్యార్థులు అమెరికాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నూటా నీక్స్ లో 58.57 లక్షల వార్షిక ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలకు ఎంపికైనరని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జె.వి షణ్ముఖ కుమార్ , శ్రీ గాయత్రీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సిహెచ్. రామకృష్ణారావు ,మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. భరద్వాజ్ అకడమిక్ డీన్ పాతూరి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సిహెచ్. ఉషా చంద్రిక, అకడమిక్ డీన్ ఐ వి వెంకటేశ్వర్లు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గీతా శ్రీనివాస్, అక్కడ మీకు డైరెక్టర్ ఒంగోలు రేవంత్ , కె.ఎల్. యూనివర్సిటీ ప్రకాశం, నెల్లూరు జిల్లా మేనేజర్లూ పి ఆంజనేయ వరప్రసాదరావు, ఆర్.శేఖర్ బాబు ,ఎ. మస్తాన్ వలి షేక్ నాయాబ్,కె.ఎల్.డీమ్డ్ యూనివర్సిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)