నూతన సంవత్సర సంబరాల్లో వెళ్లువెత్తిన ప్రజాభిమానం.
BSBNEWS - KANDUKUR
కందుకూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా విచ్చేసి గజమాలలు ధరింపజేసి,పూల బొకేలతో,దుశ్శాలవలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు, పట్టణంలోని అన్ని గ్రామాల, వార్డుల ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచులు, పార్టీ వివిధ భాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా వెల్లువెత్తారు. ముందుగా బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. విడతలవారీగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులను పేరుపేరునా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విచ్చేసిన వేలాది మంది అభిమానులకు ప్రేమ విందు ఏర్పాటు చేసి సమృద్ధిగా అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి నాయకులు తోకల.కొండయ్య, రావులకొల్లు.బ్రహ్మానందం, ముప్పవరపు.కిషోర్,గణేశం. గంగిరెడ్డి, షేక్ రఫీ, కందిరాజు సాంబశివరాజు చీమల. వెంకటరాజా,ఈదర రమేష్, రేణమాల. అయ్యన్న, బిల్లా.రమణయ్య, నన్నం పోతురాజు, కాపులూరి కృష్ణ , నోటి.వెంకటేశ్వర రెడ్డి చింతలపూడి రవీంద్ర కట్టా హనుమంతరావు గేరా మనోహర్ తానికొండ శ్రీను, పాశం కొండయ్య, ఉప్పుటూరి నాగేశ్వరరావు, వల్లూరి కోటేశ్వరరావు, యరమాల నాగభూషణం, అప్పన బోయిన.రాజేష్, నగళ్ళ నారయ్య, ఉలవపాడు జడ్పిటిసి శ్రీనివాసమూర్తి, లింగసముద్రం ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, వలేటివారిపాలెం ఎంపీపీ పొనుగోటి మౌనిక, గుడ్లూరు ఎంపీపీ పులి. రమేష్, ఉలవపాడు ఎంపీపీ వాయలమస్తానమ్మ, వైస్ ఎంపీపీ షేక్.ఫజిల్ కాకు వెంకటస్వామి చెరుకూరి బ్రహ్మయ్య, గౌడుపేరు ఆనందరావు, వెలిచెర్ల ధనకోటి, గాజుల కిషోర్, దగ్గుమాటి కోటయ్య, షేక్ రహీం, తలపనేని గోపి, వెంకట్రామిరెడ్డి, దేవరకొండ ఆదిలక్ష్మి, తన్నీరు ధరణీ తదితరులు పాల్గొన్నారు.