శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర విద్యా మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలియజేశారు. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికి కలగాలని దుష్టులను శిక్షించి మంచివారిని రక్షించడానికి జగజ్జనని శ్రీ కన్యకా పరమేశ్వరి అవతారం దాల్చారన్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రజలందరికీ వాసవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి వెంకట సుబ్బారావు, మురారిశెట్టి సుధీర్, కోత్తూరి వెంకట సుధాకర్, కోట నరసింహం, కోటా కిషోర్, గుర్రం అల్లూరయ్య, చీదెళ్ళ వేణు, తాతా లక్ష్మీనారాయణ, కాకుమాని ప్రవీణ్, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, చిలకపాటి మధు, ముచ్చు శ్రీను, బెజవాడ ప్రసాద్ వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ మరియు పార్టీ నాయకులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.