తహసిల్దార్ కి శుభాకాంక్షలు తెలిపిన డీలర్లు
BSBNEWS - కందుకూరు
కందుకూరు తహసిల్దార్ ను రేషన్ డీలర్లు బుధవారం ఉదయం తన కార్యాలయంలో కలిసి, దుశ్యాలువ, పుష్ప గుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలములోని పలువురు డీలర్లు పాల్గొన్నారు.