తెలుగు ప్రజల ఆరాధ్య దైవం డా.ఎన్టీఆర్ వర్ధంతిని విజయవంతం చేయండి ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - KANDUKUR
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి ఈనెల 18వ తేదీన జరుగుతుందని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాల్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు ఎవరు మరిచిపోరన్నారు. పౌరాణిక పాత్రలకు జీవం పోసి నటునిగా, రాజకీయ నాయకునిగా, పేద ప్రజల ఆశాజ్యోతిగా తన మహోన్నత ప్రస్థానాన్ని చాటారన్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో భారీగా రక్తదానం, అన్నదానం కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, సిహెచ్ కొండయ్య, బెజవాడ ప్రసాద్, మాదాల మాల్యాద్రి, జె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.