బి ఎస్ బి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

bsbnews
0

 బి ఎస్ బి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

BSBNEWS - KANDUKUR 

స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ , సిపిఐ కార్యాలయంలో ఏపీయు డబ్ల్యూజే అనుబంధ సామ్నా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. బాలకోటయ్యలు  బి ఎస్ బి న్యూస్ క్యాలెండర్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం సమస్యలపై నిరంతర వార్త కథనాలు ప్రచురిస్తూ ముందుకు సాగుతున్న బి ఎస్ బి న్యూస్ కేబుల్ నెట్ వర్క్ ను అభినందించారు. ప్రజలకు మరింత సమాచారాన్ని అందించాలని బి ఎస్ బి న్యూస్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. బి ఎస్ బి న్యూస్ ఛానల్ అభివృద్ధి చెందుతూ ప్రజల మన్నలను మరింత ఎక్కువ సంపాదించుకునేలా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. బి ఎస్ బి న్యూస్ ఛానల్ , వెబ్సైట్ ద్వారా అందరికంటే ముందుగా వార్తలను అన్ని కోణాలలో ప్రజలకు అందించటం అందరి వల్ల సాధ్యం కాదని దానిని సుసాధ్యం చేస్తూ బి ఎస్ బి న్యూస్ యాజమాన్యం ముందుకు సాగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ బి న్యూస్ ఎం.డి యర్రంశెట్టి ఆనందమోహన్, బి ఎస్ బి న్యూస్ వలేటివారిపాలెం రిపోర్టర్ మర్రి అంజయ్య, కందుకూరు మీడియా మిత్రులు సురేష్ బాబు, ప్రభాకర్, రాము, కృష్ణ, చంద్ర, అజయ్, ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి మాధవరావు, రవి, ఏసుబాబు, దుర్గాప్రసాద్, అనిల్, మనోహర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)