పేదల పాలిట ఆపద్బాంధవుడు చంద్రబాబునాయుడు
- 15 మంది బాధితులకు 13,38,533/- రూపాయలు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
BSBNEWS - KANDUKUR
పేదల పాలిట ఆపద్బాంధవుడు చంద్రబాబునాయుడు అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయపట్నం పోర్ట్ భూ నిర్వాసిత గ్రామాలైన కర్లపాలెం, సాలిపేట గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నూతన గృహ నిర్మాణములు, మౌలిక వసతుల కల్పనకు సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్ర మంత్రి చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడునని తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య విషయంలో పూర్తిగా విస్మరించిందని, గత ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు కూడా అంతంతమాత్రంగా ఉండేవని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ పేదల వైద్యానికి అయ్యే ఖర్చులు అత్యధిక భాగాన్ని అందజేస్తున్నారని, ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యాన్ని అందించటమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి వారికి అందజేస్తున్నారని ఇంకా కొంతమందికి తక్షణ వైద్యం చేయించుకోవడానికి నిధులు లేని వారికి ఎల్ఓసి ద్వారా నిధులు సమకూరుస్తున్నామని తెలియజేశారు. వైద్య ఖర్చులకు అయ్యే వ్యయం పేదలకు భారం కాకూడదని కూటమి ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు.
బాధితులు వివరములు..
1) మాదాల మాధవరావు, పోలినేనిపాలెం గ్రామం వలేటివారిపాలెం మండలం 81000/- రూపాయలు
2) షేక్ మస్తాన్ చిన్న అమ్మపాలెం గ్రామం, వలేటివారిపాలెం మండలం 81000/- రూపాయలు
3) మద్దసాని రామ్మూర్తి అడవి రాజుపాలెం గ్రామం గుడ్లూరు మండలం 50115/- రూపాయలు
4) దామా ఆదిలక్ష్మి, బిలాల్ నగర్ కందుకూరు పట్టణం 8100/- రూపాయలు
5) ఏకాంబరం నవీన్, బలిజిపాలెం గ్రామం, కందుకూరు మండలం 245590/- రూపాయలు
6) పల్లెపాటి యలమంద కోటయ్య కరేడు గ్రామం ఉలవపాడు మండలం 37292/- రూపాయలు
7) సయ్యద్ షఫీ, సుల్తాన్ మోహిద్దిన్ నగర్, కందుకూరు పట్టణం 25000/- రూపాయలు
8) గుడ్లూరు రవణమ్మ, ఉలవపాడు పంచాయతీ ఉలవపాడు మండలం 62038/- రూపాయలు
9) కాకుమాని సుశీల కోటు వారి వీధి, కందుకూరు పట్టణం 25541/- రూపాయలు
10) చీర్లదిన్నె పిచ్చమ్మ, కోటారెడ్డి నగర్, కందుకూరు పట్టణం 30000/- రూపాయలు
11) మద్దిబోయిన వెంకట శేషమ్మ, గుడ్లూరు పంచాయతీ గుడ్లూరు మండలం 162000/- రూపాయలు
12) ఉప్పు శ్రీనివాసులు, లింగసముద్రం పంచాయతీ లింగసముద్రం మండలం 97213/- రూపాయలు
13) మురకొండ రామారావు, డివి నగర్, కందుకూరు పట్టణం 157904/- రూపాయలు
14) బొక్క లక్ష్మమ్మ, ఆనందపురం గ్రామం కందుకూరు పట్టణం 45350/- రూపాయలు
15) చల్లా జయమ్మ ఓగూరు గ్రామం కందుకూరు మండలం 157490/- రూపాయలు
16) మంది లబ్ధిదారులకు మొత్తం 13,38,533/- రూపాయలను అందజేయడం జరిగింది..
కందుకూరు నియోజకవర్గ పేదల ఆరోగ్య విషయంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన నారా చంద్రబాబునాయుడుకి కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మా ఆరోగ్య విషయంలో ఇంత మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయుటకు కృషిచేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు మరమ్మత్తు పనులను పూర్తిచేసి ఆయకట్టు రైతులకు కాలువ ద్వారా నీరు ఇవ్వటం జరిగిందని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేసిందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా గేటు మరమ్మత్తులను పూర్తిచేసిన మెగా ఇన్ఫాస్ట్ట్రక్చర్స్ కంపెనీ నిపుణుల బృందానికి రాళ్లపాడు ఆయకట్టు రైతుల తరఫున ధన్యవాదములు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరుపేరునా ఎంఎల్ఏ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, సవిడిపోయిన వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.