శ్రీసంస్కృతి స్కూల్ లో అంబరాన్ని అంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

bsbnews
0

 శ్రీసంస్కృతి స్కూల్ లో అంబరాన్ని అంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

BSBNEWS - కందుకూరు 






పట్టణంలోని గుర్రం వారి వీధి లోని శ్రీ సంస్కృతి పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటేల ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ సంప్రదాయ దుస్తుల్లో చక్కగా అలంకరించుకుని పాఠశాల కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయ బద్దంగా పొంగలి వండి నైవేద్యం సమర్పించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అచ్చ తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా గుడిసెలు నిర్మించి బొమ్మలకొలువులతో, చిత్రవర్ణ శోభిత రంగవల్లులు, హరిదాసుల ఆలాపనలు, డూ..డూ బసవన్నలు, సన్నాయి రాగాలు, కోడిపందాలు, కోలాటం భోగిమంటలు, గొబ్బెమ్మలు, గాలిపటాల గగన విహారాలు తెలుగు పిండివంటకాల షడ్రుచులతో పల్లె పడుచు దనాలతో, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం వంటి కార్యక్రమాలతో,విద్యార్థులు అలరించి కనువిందు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ కొంకా చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు వారి పండుగల్లో అతి ప్రధానమైనది సంక్రాంతి పండుగని, రైతన్నలు సుఖసంతోషాలతో తమ పంటను ఇంటికి తెచ్చుకుని వేడుకగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం కాబట్టి మకర సంక్రాంతి అని పిలుస్తారని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను మరువకుండా గౌరవించే విధంగా విద్యార్థులకు తెలియజేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు కు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.శివ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాద్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)