అధికారులకు మీరైనా చెప్పండి ఎమ్మెల్యే సారూ..
- పడిపోవటానికి సిద్ధంగా ఉన్న భారీ వృక్షం
- ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని నందలపూరు గ్రామంలో విద్యార్థులు చదువుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక భారీ వృక్షం పడిపోయే పరిస్థితిలో ఉంది అయితే ఆ వృక్షం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గది ఎదురుగా ఉంది. వృక్షం అనుకోని స్థితిలో పడిపోతే పాఠశాల భవనంతో పాటు చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు సైతం ప్రమాదం వాటిల్లే పరిస్థితిని ఉంది అని ప్రధానోపాధ్యాయులు తెలుపుతున్నారు. ఈ భారీ వృక్షం వలన దాని యొక్క వేర్లు పాఠశాల గోడల్లోకి, బండ పరుపులోకి వెళ్లి పాఠశాల ప్రాంగణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. దీనిని యుద్ధ ప్రాతిపదికన తొలగించకపోతే పిల్లలకి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి పాఠశాలకు ప్రతిరోజు వచ్చి పోయేటువంటి తల్లిదండ్రులకి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని బిక్కుబిక్కు నా పాఠశాలలో ఉంటున్నామని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని శాసనసభ్యులుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.