సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

bsbnews
0

సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి 

BSBNEWS - కందుకూరు 

సంక్రాంతి సంబరాల అనంతరం సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఒక యువకుడు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం, తిమ్మపాలెం పంచాయితీ లోని శివన్నపాలెం గ్రామానికి చెందిన నోసిన జెస్సిక(15), నోసిన మాధవ(25 ), నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(16) తదితరులు గుర్తించడం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మొత్తం 5 మంది గురువారం ఉదయం సముద్ర స్నానం కోసం సింగరాయకొండ సమీపంలోని పాకల బీచ్ వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా పెద్ద పెద్ద అలలు రావడంతో మొత్తం ఐదు మందిలో ఒకరిని స్థానిక జాలర్లు రక్షించగా, మిగిలిన  నలుగురు గల్లంతు అయ్యారు. ఇందులో ముగ్గురు ఆ పెద్ద పెద్ద అలల తాకిడికి తట్టుకోలేక మృత్యువాతకు గురయ్యారు. గల్లంతయిన మరొకరి ఆచూకీ ఇంకా తెలియలేదు. సముద్రపు అలల ధాటికి గల్లంతయిన మరొకరి కోసం మెరైన్ పోలీసులు స్థానిక జాలర్ల సహకారంతో వెతుకులాట ముమ్మరం చేశారు. మృతులు ముగ్గురు కూడా రక్త సంభందీకులని తెలుస్తోంది. తమ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సముద్రపు స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు,బంధు మిత్రులతో రోదనలతో శివన్న పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా జరిగిన సంఘటన పట్ల పలువురు నాయకులు వెంటనే స్పందించారు. సుఖ, సంతోషాల మధ్య మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్న ఆ ముగ్గురు ముక్కనుమ రోజున  మృత్యువాత కు గురికావడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎం.పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు  శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు, రాష్ట్ర మెరైన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్యన్నారాయణ (సత్య), రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు దిగ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)