టూ వీలర్స్ మెకానిక్స్ కు అండగా ఉంటా ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని ఇస్లాంపేట, షాదీఖానా నందు కందుకూరు బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ మెకానికల్ సంక్షేమానికి తాను ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ వద్దకు రావచ్చని తెలిపారు. బైక్ మెకానిక్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి పథకాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి బైక్ మెకానిక్ సభ్యుడు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే వెల్ఫేర్ కార్డు తీసుకోవాలని బైక్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా అనుకోని ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. కందుకూరు పట్టణంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సందర్భంలో బైక్ మెకానిక్స్ సభ్యులు ఎవరికైనా ఇళ్ల స్థలం లేకుండా అర్హులైన వారికి తప్పనిసరిగా ఇంటి పట్టాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని బైక్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, లేబర్ ఆఫీసర్ మేరీ సుజాత, రాష్ట్ర టూపర్ అసోసియేషన్ అధ్యక్షులు డి ధర్మా, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.