సంస్కృతి స్కూల్లో ప్రారంభమైన మనోహర్ రెడ్డి టాలెంట్ టెస్ట్ పరీక్షలు

bsbnews
0

సంస్కృతి స్కూల్లో ప్రారంభమైన మనోహర్ రెడ్డి టాలెంట్ టెస్ట్ పరీక్షలు

BSBNEWS - KANDUKUR



స్థానిక సంస్కృతి స్కూల్ వేదికగా మనోహర్ రెడ్డి టాలెంట్ టెస్ట్ కాన్స్టిట్యూషన్ లెవెల్ ఎగ్జామ్ అపస్మా ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ పాఠశాలల నుండి పదుల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎగ్జామ్ అబ్జర్వర్సగా కావలి నియోజక వర్గం నుండి మజహార్, వెంకట్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో షేక్.హీన (నాగర్జున పబ్లిక్ స్కూల్), ద్వితీయ స్థానంలో కె. జశ్వంత్ (శ్రీ సంస్కృతి స్కూల్), తృతీయ స్థానంలో ఎ.వర్ష (సిద్ధార్థ స్కూల్) లు విజేతలుగా నిలిచారన్నారు. వీరు జిల్లాలో జరిగే జిల్లా స్థాయి ఎగ్జామ్స్ కి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కందుకూరు కాన్స్టిట్యూషన్  ప్రెసిడెంట్ రామారావు, సెక్రెటరీ సాయిబాబు, పలువురు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు హాజరయ్యారు.

Post a Comment

0Comments
Post a Comment (0)