హెల్మెట్ రక్షణ కవచం... డి.ఎస్.పి

bsbnews
0

హెల్మెట్ రక్షణ కవచం... డి.ఎస్.పి 

BSBNEWS - కందుకూరు


కందుకూరు డిఎస్పి సిహెచ్ బాలసుబ్రమణ్యం  ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలలో భాగంగా ప్రజలలో రోడ్డు భద్రత పట్ల అవగాహన కొరకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  డిఎస్పీ  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సందర్భాలలో హెల్మెట్ ధరించి నడపవలెనని లేనియెడల ప్రమాదం జరిగిన సందర్భాలలో తలకు గాయాలై చనిపోవడం లేదా తీవ్ర గాయాలు అవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాదం జరగకుండా ఉండాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించటం ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం కూడా వీధిన పడకుండా రక్షిస్తుందని ప్రయాణ సమయాల్లో తప్పక హెల్మెట్ ధరించాలని దానిపైన ప్రజలలో అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.అవగాహన చేసిన తర్వాత కూడా ఎవరైనా ధరించకుండా బైకులు నడిపితే చట్ట ప్రకారం జరిమానాలు కేసులు నమోదు చేయబడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య  లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎస్ఐ ధన్యవాదాలు తెలియజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)