ప్రభుత్వ పాఠశాలలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్న పోస్ట్ మాస్టర్

bsbnews
0

 ప్రభుత్వ పాఠశాలలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్న పోస్ట్ మాస్టర్వ

BSBNEWS - VALETEVARIPALEM


 తనకు భవిష్యత్ అందించిన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆత్మస్థైర్యం ఇచ్చేందుకు పోస్ట్ మాస్టర్ ప్రదీప్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల మధ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని నలదలపూరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న ప్రదీప్ తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందలపూరులో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అందరికీ 2025 మార్చిలో జరగబోయే పరీక్షల కోసం ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఆత్మస్థైయులతో 10వ తరగతి పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు బీరకాయల మాధవరావు, సిబ్బంది అందరూ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పేద విద్యార్థుల కొరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రదీప్ తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)