తల్లి ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం

bsbnews
0

 తల్లి ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం 

BSBNEWS - కందుకూరు 


కందుకూరు మండలంలోని పలుకూరు గ్రామంలో ఈనెల 7వ తేదీ కొండూరు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు. తన కొడుకు మరణం పై అనుమానం ఉందని మృతుడి తల్లి కందుకూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిజ నిజాలు వెలికి తీసే ప్రయత్నంలో శుక్రవారం కందుకూరు రెవెన్యూ, పోలీస్ అధికారుల ఆద్వర్యంలో  మృతదేహాన్ని బయటికి తీసి శవపరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ వేంకటేశ్వర రావు, సిఐ.కె వెంకటేశ్వర్లు, కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్, కందుకూర్ తహసిల్దార్ ఇక్బాల్, , వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)