కళాకారుల సంక్షేమమే మా లక్ష్యం
BSBNEWS - కందుకూరు
అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం కోవూరు రోడ్ లోని కళాకారుల సాధన కార్యాలయం వద్ద, చందమామ సప్లయర్ షాపు వద్ద ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మన్నేపల్లి వరప్రసాద్ అధ్యక్షత వహించగా జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ కళలు అంతరిస్తున్న నేటి తరుణంలో కళాకారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం పాటుపడటం అభినందనీయమని అన్నారు. రాఘవేంద్ర కళాపరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళలకు నిలయం కందుకూరు అని ఎంతో గొప్ప కళాకారులు అందరికీ వందనాలు అని అన్నారు. అన్నమయ్య సాహిత్య సేవ సంస్థ కార్యదర్శి శేషగిరిరావు మాట్లాడుతూ పద్య పౌరాణిక నాటకాలు బ్రతికి బట్ట కడుతున్నాయంటే మీలాంటి కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ద్వారా సజీవంగా ఉన్నాయని అన్నారు. పద్య కవి మార్తాటి ఈశ్వరగోపాల్ మాట్లాడుతూ కళా రంగం నూతన వరవడులను సృష్టించుకుని ముందుకు సాగాలని కోరారు. దండోరా దాసు మాట్లాడుతూ కళాభిమానులుగా కళాకారులను గుర్తుంచుకొని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాకారులు, కవులు,రచయితలు, కళాభిమానులు, భజన గురువులతో పాటు గాండ్ల హరి ప్రసాదు బోధి, మొసలి బ్రహ్మయ్య, పి గాంధీ, వి.రాఘవేంద్ర, మేడికొండ భాస్కర్, వెంకటేశ్వర్లు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.