మోపాడులో పొలంబడి
BSBNEWS - కందుకూరు
మండలంలోని మోపాడు గ్రామంలో గ్యాప్ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసు) పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ పొలంబడిలో రైతులకు సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహణ కల్పించి రైతులకు మంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందుటకు సలహాలు సూచనలు ఇవ్వటమే దీని ఉద్దేశం అని తెలియజేసారు. వరిలో నీటి యాజమాన్యం, సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సహాయ వ్యవసాయ సంచాలకులు పి.అనసూయ మాట్లాడుతూ ప్రస్తుతం వరిరకం కె.ఎన్.ఎం 1638 వరిలో 30-40 రోజులలో వెన్నువస్తుంది అని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, దీని నివారణకు ఈ రకం పంట అధిక వర్షాలు, సూర్యరశ్మి తక్కువ వలన వాతావరణం చల్లగా వుండటం వలన వెన్నుత్వరగా వస్తుందని, రైతులు మొదట వారంలో యూరియా ఒక బస్తా బురద నేలలో తక్కువ నీరు నిల్వ ఉంచి చల్లాలని, తదుపరి రెండు రోజులు ఆరనిచ్ఛి నీటిని 2 సెం.మీ నిల్వ వుంచి మరల వారం వ్యవధిలో ఒక బస్తా యూరియా, 25 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలని సూచించారు. అవసరం మేరకే యూరియా వాడాలని, అధిక మోతాదులో వాడకూడదు అని తెలియజేసారు. యూరియా వాడకం తగ్గించుకోవాలని, అవసరానికి మించి వాడకూడదని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయ అధికారి పి.మాధవ మాట్లాడుతూ ఘన, ద్రవ జీవామృతం తో భూమిలో సహజ పోషకాలు, సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది, నాణ్యమైన అధిక దిగుబడులు పొందుటకు అవకాశం కలదు అని తెలియజేసారు. తదుపరి మండల వ్యవసాయాధికారి వి. రాము వరి పంట పొలాలను పరిశీలించి, వరిలో పంట ప్రయోగాలను, ఆకు కత్తిరింపు వలన వరి పంట మరల ఆకులను పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యం వుందని తెలియజేసారు. వరిలో ఆకుముడత నివారణకు కార్థాప్ హైడ్రో క్లోరైడ్ 2.గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ అధికారి డి ధనమ్మ మాట్లాడుతూ వరి లో గ్రోత్ ప్రమోటర్ గా పంచ గవ్య పిచికారి చేయాలని, పురుగు, గ్రుడ్డు దశ నుండి కాపాడుకోవడానికి వేప గింజల కశాయాలు పిచికారి చేయాలి అని చెప్పారు. ఈకార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఇ. రమణయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.