ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ , ఎస్టీ ఉపాధ్యాయ సంఘం 2025. డైరీని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆదర్శప్రాయంగా సమాజ హితాన్ని కోరుతూ ముందుకు సాగాలన్నారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా, అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ లోకానికి ఎల్లవేళలా ఏ సమస్య వచ్చిన తాను అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల మాల్యాద్రి, జిల్లా అధ్యక్షులు జయరావు, మాధవరావు, జిఎస్., శ్రీనివాసులు, తెదేపా పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు, మాదాల మాల్యాద్రి, కందుకూరు పట్టణ ఎస్సీ విభాగపు అధ్యక్షులు పులి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు