శ్రీ సంస్కృతి స్కూల్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

bsbnews
0

 శ్రీ సంస్కృతి స్కూల్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

BSBNEWS - కందుకూరు 




పట్టణంలోని శ్రీ సంస్కృతి స్కూల్ లో  76వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో, దేశభక్తి భావంతో ఘనంగా జరిగాయి. ముందుగా ప్రిన్సిపాల్ డీ. శివకుమార్ జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభించారు. విద్యార్థులు,  ఉపాధ్యాయుల సమక్షంలో జాతీయ గీతాన్ని గర్వంతో ఆలపించారు. వేడుకల్లో భాగంగా, విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, స్కిట్లు గణతంత్ర దినోత్సవ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారు ఇచ్చిన ప్రసంగాలు, ప్రజెంటేషన్లు రాజ్యాంగంలోని సమానత్వం, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా చైర్మన్ కొంక చంద్ర శేఖర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మన దేశ పునాదులుగా నిలిచిన మహానాయకుల త్యాగాలను గుర్తు చేసే మహత్వమైన రోజు అని అన్నారు. విద్య దేశ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇలాంటి దేశభక్తి భావాలను విద్యార్థుల్లో నాటేందుకు మన పాఠశాల చేస్తున్న కృషి నాకు గర్వకారణమన్నారు. దేశ సమృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ డీ. శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు చూపిన ఉత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు క్రమశిక్షణ, బాధ్యత, గౌరవం వంటి విలువలను అనుసరించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని సందేశం ఇచ్చారు. అనంతరం మిఠాయిల పంపిణీ చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)