చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారిన జగన్ అప్పులు- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

bsbnews
0

చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారిన జగన్ అప్పులు

- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

BSBNEWS - కావలి 

జగన్ చేసిన అప్పులు చంద్రబాబు ప్రభుత్వానికి గుది బండలా తయారయ్యాయని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఏడాదికి 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలని ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుది బండలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని, ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయి పెట్టలేదన్నారు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేసారని మండిపడ్డారు. జగన్ విలాసాలు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా సుమారు రూ. 19, 871.35 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్ కు అనుమతులు, ఇలా ప్రతిదాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారని అన్నారు. ప్రతి దాంట్లో చేతివాటం చూపారన్నారు. వీటన్నింటితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, నేటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గుదిబండగా తయారై, ప్రజల పాలిట శాపంగా మారిందని తెలిపారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)