సమసమాజ స్థాపకుడు లెనిన్... సిపిఐ నేత వెంకయ్య
BSBNEWS - కందుకూరు
లెనిన్ 100 వ వర్ధంతి కార్యక్రమం కోటారెడ్డిభవన్లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు కమ్యూనిజం వ్యాప్తి చెందటంలో లెనిన్ పాత్ర గొప్పదని రష్యా సోవియట్ ఉద్యమాల తర్వాత ప్రపంచ దేశాలకి కమ్యూనిస్టు పార్టీలు వ్యాప్తి చెందాయని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సమసమాజ స్థాపన కోసం లెనిన్ కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. మార్క్స్ రచించిన సిద్ధాంతాలను వడపోసి పేద ప్రజలకు అవసరమైన కూడు గుడ్డ గూడు అనే నినాదంతో కమ్యూనిజం వ్యాప్తి చెందటానికి ఆయన కృషి చేశాడు అని అన్నారు. ఆయన ప్రోత్బలంతోనే భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూ లెనిన్ జీవితం పేద ప్రజలను సంపన్నులు చేయడం కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైనదని ఇప్పటికి ఆయన చనిపోయినా ఆయన భౌతిక ఖాయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల సందర్శార్థం అందుబాటులో ఉంచారని అన్నారు.అంతటి గొప్ప మహా వ్యక్తి లెనిన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు కే మురళి, వై ఆనంద్ మోహన్, కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్, నత్త రామారావు, డి ఆదినారాయణ, ఉప్పుటూరు మాధవరావు, ఎన్ నరసయ్య, ఏఐవైఎఫ్ అధ్యక్షులు కార్యదర్శులు సిహెచ్ దుర్గాప్రసాద్, బి చంద్రమోహన్, పార్టీ నాయకులు హరిబాబు, కోటేశ్వరరావు, సీతారామయ్య, వీరాంజనేయులు పాల్గొన్నారు.