నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండేళ్లు

0

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండేళ్లు

BSBNEWS - కందుకూరు


\తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి నారా లోకేష్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులుకు కారణమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో రెండేళ్లు పూర్తయిందని, ఈనాటి ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, జగన్ వైసీపీ పార్టీ తుడిచి పెట్టి పోవడానికి రెండు సంవత్సరాల  క్రితం ఇదే రోజున తొలి అడుగు పడిందని  తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువత, నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న కష్టాలను యువగళం పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా  ముందుకు సాగుతున్న రాష్ట్ర విద్యా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ అని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పార్టీ నాయకులు వడ్డెళ్ళ రవిచంద్ర బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుమ్మా శివ, బైరపనేని రమణయ్య, బొద్దులూరి కొండలరావు, రావుల రవి, మన్నం కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)