మోపాడు, మాచవరంలో పొలం పిలుస్తుంది

bsbnews
0

మోపాడు, మాచవరంలో పొలం పిలుస్తుంది 

BSBNEWS - కందుకూరు



మండలంలోని మోపాడు, మాచవరం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ ప్రస్తుతం వరి రకం కె ఎన్ ఎం 1638 చిరు పొట్ట నుండి కంకి దశలో ఉందని రైతులు పైపాటుగా వేసే కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి యూరియా 50 కేజి, పొటాష్ 20 కేజీలు ఒక ఎకరానికి వాడాలనీ, అవసరాన్ని బట్టి యూరియా వాడకాన్ని తగ్గించి వేసుకోవాలని, మార్కెట్ లో యూరియా, డి ఎ పి బదులు నానో యూరియా నానో డి ఎ పి అందుబాటులో ఉన్నాయని వాటిని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. పొగాకు వేసే రైతులు రాబోయే రోజుల్లో పొగాకు మార్కెట్ తగ్గే అవకాశం ఉంది అని, పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలియజేసారు. రబీ సీజన్లో వేసిన పంటలు అన్నిటికీ సంబధిత గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు. వరిలో ఆకుముడత నివారణకు కార్తాప్ హైడ్రో క్లోరైడ్ 2.0 మి.లీ.లేదా మార్షల్ 2.0 మి.లీ.లేదా ఒక లీటరు నీటికి లేదా ఇండాక్స్ కార్బ్ 200 మి.లీ ఒక ఎకరానికి కలిపి పిచికారి చేయాలి అని తెలియజేసారు. తదుపరి మాచవరం గ్రామంలో ఎడ్ల సీనా రెడ్డి వరి పొలంలో డ్రోన్ మిషన్ తో పిచికారీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. డ్రోన్ ద్వారా రైతుకి నీరు, సమయం, కూలీ ఖర్చు తగ్గుతుందని  ఒక ఎకరానికి 10 లీటర్ల నీటితో 5-6 నిముషాల లోపు 15 అడుగుల రేడియస్ తో పిచికారీ చేస్తూ మిషన్ ఆటోమేటిక్ లేదా మానువల్ గా పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ. రమణయ్య, సి. హెచ్. రోని రెచ్చల్, వ్యవసాయ మార్కెట్ యార్డు అసిస్టంట్ కె. అశోక్, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)