శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారి వైద్యానికి చేయూత
BSBNEWS - కందుకూరు
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అంటూ నిరంతరం పేదవారి అవసరాలను తీర్చే దిశగా అడుగులు వేస్తూ శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ(8341221414) కందుకూరు వారి ఆద్వర్యంలో గురువారం సుందరయ్య నగర్ లో నివసిస్తున్న కీళ్ళ నొప్పుల వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి కోట వెంకటేశ్వర్లు, జి.అపర్ణ సాయిరామ్, సోమిశెట్టి రవికుమార్, పొత్తూరి వెంకట సరోజిని, శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యుల సహకారంతో ఒక నెలకు సరిపడా మందులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవా హృదయ రవ్వా శ్రీనివాసులు (ఎల్ ఐ సి ఏజెంట్), వైస్ ప్రెసిడెంట్ రవ్వా అరుణ,కోటా వెంకటేశ్వర్లు, చీదెళ్ళకృష్ణ (మణికంఠ గార్మెంట్స్)* తదితరులు పాల్గొన్నారు.