సిపిఎం బహిరంగ సభ గోడ పత్రిక ఆవిష్కరణ

bsbnews
0

సిపిఎం బహిరంగ సభ గోడ పత్రిక  ఆవిష్కరణ 

BSBNEWS - వలేటివారిపాలెం  

నెల్లూరులోజరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు వీఆర్సి హైస్కూల్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని శనివారం వలేటివారిపాలెం మండల కేంద్రంలో సిపిఎం నాయకులు బహిరంగ సభ  గోడ పత్రికను ఆవిష్కరించారు. విస్తృతంగా గోడ పత్రికలను అంటించారు. ఈ సందర్భంగా సిపిఎం వలేటివారిపాలెం మండల ఇంచార్జి జీవిబీ కుమార్ మాట్లాడుతూ సిపిఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు. పాలకులు ఎన్నికలలో ప్రజలకు యిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే సభ లో అధిక సంఖ్య లో ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ సభ లో సిపిఎం పొలిట్ భ్యురో సభ్యులు కామ్రేడ్. బృందా కరత్, ఎం. ఏ బేబీ, బీవి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం. ఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, మూలం  రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడతారని తెలిపారు. ఈ గోడ పత్రికను ఆవిష్కరించిన వారిలో సిపిఎం వలేటివారిపాలెం మండల శాఖాకార్యదర్శి మాదాల రమణయ్య, సాదు చెన్నకేశవులు, చిరంజీవి తో పాటు స్థానికులు ఉన్నారు 

Post a Comment

0Comments
Post a Comment (0)