మద్యం మత్తులో కరెంట్ తీగలపై..హల్చల్
BSBNEWS
మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను ఓ తాగుబోతు హడలెత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు.