స్త్రీ శక్తి కుట్టుమిషన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి

bsbnews
0

స్త్రీ శక్తి కుట్టుమిషన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - కందుకూరు

కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు  ఆధ్వర్యంలో స్త్రీ శక్తి పేరిట కుట్టు మిషన్లు ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి, మంత్రి స్వామి మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ మహిళలు తమ స్వసక్తితో ఎదగాలని ఉద్దేశంతో కుట్టుమిషన్లను అందించడం జరుగుతుందని వీటిని వినియోగించుకొని వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)