పేదవారి ఆకలి తీరుస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్
BSBNEWS - కందుకూరు
ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో కుల,మతాలకతీతంగా నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాల్లో మంగళవారం ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఒక దాత సహాయంతో పేదవారికోసం వృద్ధులను గుర్తించి వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదవారికి సహాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్,ట్రెజరర్ హఫీజ్,ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్ షంషుద్దీన్, పాల్గొన్నారు.