అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆనంద్
BSBNEWS - నెల్లూరు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు, జడ్పీ సిఇవో విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 407 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 407 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించి 157 మున్సిపల్‌శాఖకు సంబంధించి 32, పోలీసు శాఖలకు సంబంధించి 63, సర్వేకు 35 , పంచాయతీరాజ్‌శాఖకు 27, సివిల్ సప్లయిస్‌కు విభాగానికి సంబంధించి 10 అర్జీలు అందాయి. ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.