రేపటి నుండి ఉచిత పశుఆరోగ్య శిబిరాలు ఎక్కడో తెలుసుకోండి

bsbnews
0


రేపటి నుండి ఉచిత పశుఆరోగ్య శిబిరాలు ఎక్కడో తెలుసుకోండి 

BSBNEWS - కందుకూరు

2025 జనవరి 20 వ తేది నుండి 2025 జనవరి 31వరకు మండలంలోని అన్నీ పంచాయతీలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించటం జరుగుతుందని మండల ఇంచార్జి పశు వైద్యులు డాక్టర్ యస్. సుధాకర్ తెలియజేసారు. 20వ తేదీ మండలంలోని మాచవరం, కోవూరు, 21 వ తేదీన పాలూరు, పందలపాడు, 22 వ తేదీ శ్రీరంగరాజపురం, జిల్లలమూడి 23 వ తేదీ మోపాడు, నారిశెట్టివారిపాలెం, 24 వ తేదీ కొండముడుసుపాలెం కొండికందుకూరు, 25 వ తేదీ అనంతసాగరం ,విక్కిరాలపేట, 27 వ తేదీ మహాదేవపురం, బలిజపాలెం, 28 వ తేదీ ఓగూరు, కమ్మవారిపాలెం, 29 వ తేదీ కంచరగుంట జి. మేకపాడు 30 వ తేదీ పలుకూరు ఆరోగ్య శిబిరం లో దూడలు, గేదలకు డివార్మింగ్ మందులు, గొర్రెలు, మేకలలో నట్టల నివారణ మందులు, బొబ్బ రోగం రాకుండా ముందస్తుగా టీకాల కార్యక్రమం ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో జరుగుతుందని ఆయన తెలిపారు. మండలంలోని పశు పోషకులు, గొర్రెల, మేకల పెంపకందార్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)