స్మశాన వాటిక అభివృద్ధి కోసం భారీ విరాళం అందజేత

bsbnews
0

స్మశానవాటిక అభివృద్ధి కోసం విపిజి సుకుమార్ గుప్తా రూ 4,11,116/- భారీ విరాళం*

BSBNEWS - కందుకూరు


\పట్టణంలోని ప్రముఖ విపిసి  జ్యువెలరీ షాప్ యజమాని వేముల సుకుమార్ గుప్తా తన మంచి హృదయాన్ని మరొకసారి చాటుకున్నారు. తన మంచి మనసుతో ఎన్నో మంచి కార్యక్రమాలకి లక్షలాది రూపాయలు విరాళంగా అందజేసే సుకుమార్ గుప్తా శుక్రవారం పోతురాజు మిట్ట దగ్గరలో ఉన్న హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ 4,11,116/-లు విరాళం అందజేసి తన మంచి మనసుని మరొకసారి నిరూపించుకున్నారు. స్మశాన వాటికలో వర్షాకాలంలో కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇబ్బందిగా ఉన్న తరుణంలో అక్కడకు కావలసిన వసతులకి, మృతి చెందిన వారిని ఖననం చేసేందుకు సంబంధించిన రూము కొరకు విరాళాన్ని అందజేశారు. ఈ విషయంపై శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకొని వెళ్ళగా ప్రభుత్వం తరఫున స్మశాన వాటిక అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. భారీ విరాళాన్ని అందజేసిన విపీజీ సుకుమార్ గుప్తాను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుకుమారు గుప్తా కుటుంబ సభ్యులు తిరుమలరావు, పార్ధు, ఆర్యవైశ్య నాయకులు మురారి శెట్టి సుధీర్ కుమార్, గుర్రం అల్లూరయ్య, బొగ్గవరపు బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)