అమ్మా నన్ను ఆదుకోమ్మా...
చలించిన సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ
BSBNEWS- కందుకూరు
కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకు యమ పాశాలుగా మారుతున్నారు. వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలి కానీ ఆ తల్లిదండ్రులకు వృద్ధవయస్సు వస్తే మాత్రం వారు పనికిరాకుండా పోతున్నారు. అటువంటి సంఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే నా ఆస్తిని తీసుకొని నన్ను చూడకుండా బయటకి నెట్టేశారు నాకు న్యాయం చేసి ఆదుకోమ్మా అంటూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంను ఓ వృద్ధ మహిళ సోమవారం ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మనసు చలించి నేరుగా వృద్ధ మహిళ వద్దకు వెళ్లి ఆమెను తన సొంత తల్లిలా భావించి సమస్యను వివరంగా అడిగి తెలుసుకుంది. ఆ సన్నివేశాన్ని చూసిన పలువురు సబ్ కలెక్టర్ కు ఉన్న ఔదార్యాన్ని ప్రశంసించారు.