పాలపిట్ట పుస్తక పరిచయ కార్యక్రమం ను జయప్రదం చేయండి

bsbnews
0

పాలపిట్ట పుస్తక పరిచయ కార్యక్రమం ను జయప్రదం చేయండి

BSBNEWS - కందుకూరు


కందుకూరు చారిత్రక రాజకీయ సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్రపై  కవి ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట దీర్ఘ కావ్య పుస్తక పరిచయ కార్యక్రమం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గుడ్లూరు పట్టణంలోని పాత బ్యాంకు వద్ద, రెడ్డి టీ కొట్టు ఎదురు జరుగుతుంది. ఈ పరిచయ కార్యక్రమంలో ధమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు ఉపాసక గాండ్ల హరి ప్రసాదు ప్రముఖ బుద్ధిస్టు న్యాయవాది పోకూరి కోటయ్య పాల్గొంటారు. ఈ సందర్భంగా పాలపిట్ట రచయిత ముప్పవరపు కిషోర్ కు పౌర సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండలంలోని కవులు,కళాకారులు, రచయితలు, సాహిత్య సాంస్కృతిక అభిమానులు, ప్రజాస్వామిక వాదులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము అని దళిత బహుజన సీనియర్ నాయకులు తాటిపర్తి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో దళిత, బహుజన,వామపక్ష  జాషువా సాహిత్య అభిమానులు  పాల్గొని పుస్తక పరిచయ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)