టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన శ్రీనివాసులు

bsbnews
0

టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన శ్రీనివాసులు

BSBNEWS - కందుకూరు



పట్టణంలోని టిఆర్ఆర్ జూనియర్ డిగ్రీ కళాశాలను బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ ఐ ఓ) ఏ. శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడుతూ కళాశాలకు కందుకూరులో మంచి పేరు ఉందని ఆ పేరును మంచి ఫలితాలు తీసుకొని వచ్చి కళాశాల గొప్పతనాన్ని కందుకూరు చుట్టుపక్కల ప్రాంతం వారికి తెలిసేలా చేయాలని తెలిపారు. ఇటీవల ప్రభుత్వము ప్రారంభించిన సంకల్ప 2025 ను శ్రద్ధగా వినియోగించుకొని నూరు శాతం ఉత్తీర్ణతను సాధించాలని తెలిపారు. సైన్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రాక్టికల్స్ బాగా చేసి రాబోయే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ని, థీరి ఎగ్జామ్స్ ని బాగా రాసి మీ తల్లిదండ్రులకు మీకు మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ఇటీవల కళాశాల ఆవరణలో జరిగిన నెహ్రూ యువ కేంద్రం వారు నిర్వహించిన క్రీడ పోటీలలో బహుమతులు పొందిన విద్యార్థులకి మెమోంటో  మెడల్స్ ను అందించారు. కందుకూరులో నిర్వహించిన క్రీడలలో జూనియర్ కళాశాల బాలికల టీం ఖో-ఖో లో ద్వితీయ స్థానం ( ఎస్తేరమ్మ దీపిక చైతన్య కుమారి బ్రహ్మణి) టీం కైవసం చేసుకోగా,100 మీటర్ల పరుగు పందెంలో,షాట్ పుట్ లో కళాశాల ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి. బలరాం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నెల్లూరులో జిల్లా స్థాయి జరిగిన పోటీలలో బలరాం 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయిలో అండర్ 19 స్కూల్ గేమ్స్ శ్రీకాకుళంలో జరిగినవి ఇందులో థర్డ్ ప్లేస్ సాధించిన బాస్కెట్బాల్ క్రీడాకారులను ఆర్ఐఓ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి, పిడి సుబ్బారావు, అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలియజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)