ఘనంగా పిడికిటి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు
BSBNEWS - కందుకూరు
కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి పట్టణంలోని సూర్య బార్ అండ్ రెస్టారెంట్లో పిడికిటి వెంకటేశ్వర్లు అభిమానులు రెస్టారెంట్ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిడికిటి వెంకటేశ్వర్లు అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరుకుని కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు తోపాటు ఆయురారోగ్యాలతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా కందుకూరు పట్టణం కోవూరు రోడ్ లోని దివ్యాంగుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం దివ్యాంగులకు ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకల్లో టిడిపి నాయకులు మహర్షి శ్రీను చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాదు ముచ్చు శ్రీనివాసరావు శివ తదితరులు పాల్గొన్నారు.