నేత్రదానం చేసిన నాగసూరి పద్మావతి

bsbnews
1 minute read
0

నేత్రదానం చేసిన నాగసూరి పద్మావతి

BSBNEWS - కందుకూరు 


సత్యసాయి సేవా సమితి సభ్యులు, విశ్రాంత పోస్ట్ మాస్టర్ నాగసూరి శ్రీమన్నారాయణ సతీమణి నాగసూరి పద్మావతి శుక్రవారం రాత్రి మరణించారు. ఆమె మరణానంతరం నలుగురికి చూపునివ్వాలనే సంకల్పంతో సక్షమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చన్నా రామాంజనేయులు కోరిక మేరకు నాగసూరి పద్మావతి నేత్రదానానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. నాగసూరి పద్మావతి జీవించి ఉన్న సమయంలో శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి ద్వారా అనేక భక్తి సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనేవారు. ఆమె జీవించి ఉన్నప్పుడు  పదిమందికి సేవ చేసే ఆమె, మరణానంతరం కూడా నలుగురికి చూపునివ్వాలనే సంకల్పంతో వారి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. వారి నేత్రాలను నెల్లూరు మోడ్రన్ ఐ హాస్పిటల్ కు అందజేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ నేత్రదానంలో కంటి లోని పలుచని పారదర్శకమైన కార్నియా పొర మాత్రమే సేకరిస్తారు.  దీనికి కేవలం ఐదు నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది.  కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్ర దానాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటించాలని కోరారు. ఇలానే ప్రతి ఒక్కళ్ళు జీవించి ఉన్నప్పుడు సేవ ఎలా చేస్తారో, మరణానంతరం కూడా నేత్రదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపాలని రామాంజనేయులు ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులను రామాంజనేయులు అభినందించారు. నేత్రదాన కార్యక్రమంలో  ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)