పెట్రోల్ బంక్ కి అక్కడ స్థలం ఎలా ఇస్తారు...అభివృద్ధి కమిటీ సభ్యులు

bsbnews
0

పెట్రోల్ బంక్ కి అక్కడ స్థలం ఎలా ఇస్తారు...అభివృద్ధి కమిటీ సభ్యులు 

BSBNEWS - కందుకూరు 

గత ప్రభుత్వ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కందుకూరు తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు ప్రజల ఆకాంక్ష మేరకు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ దివి శివరాం అన్నారు. శనివారం శివరరాం నివాసంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలపై ముఖ్యంగా తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ ఇప్పటికే సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయినా నిబంధనలకు వ్యతిరేకంగా పెట్రోల్ బంకు ఏర్పాటు కోసం సర్వే చేయడం దారుణమని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం ఆ ప్రయత్నాలను అడ్డుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాలేటి కోటేశ్వరరావు పొడపాటి శ్రీనివాసరావు తోకల వెంకటేశ్వర్లు రాజేంద్ర బాబు చింతర బోయిన నరేష్ సుభాన్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)