నూకవరం, కాకుటూర్ గ్రామంలో పొలం పిలుస్తుంది
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని నూకవరం, కాకుటూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ నూనె గింజలు సాగు లాభదాయంగా ఉంటుందని, నువ్వు పంట సాగు చేసుకుంటే లాభదాయంగా ఉంటుందని, ప్రస్తుతం నువ్వులు మార్కెట్లో 13,000/- నుండి 14,000/- వరకు మంచి గిట్టుబాటు ధర ఉంది కాబట్టి మినుము అనంతరం నువ్వు పంట సాగు చేసుకోవలసినదిగా సూచించారు. కావలసిన విత్తనాలు నువ్వుల రకాలు వై ఎల్ ఎం 146, వై ఎల్ ఎం 66 రకాలు చిన్న పావని రీసెర్చ్ స్టేషన్ నందు అందుబాటులో ఉన్నాయన్నారు. కావలసిన రైతులు మీ గ్రామ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించవలసినదిగా తెలియజేశారు. ఈ రబీలో సాగు చేసిన పంటలన్నీ ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా తెలిపారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల భీమా చెల్లించి ఉన్న రైతులకు పంటల బీమా పొందాలి అంటే ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు. మీ గ్రామ పరిధిలోని వ్యవసాయ ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా తెలిపారు. అనంతరం మిరప పంట పొలాలను పరిశీలించారు. మిరప లో అధికంగా పై ముడత ఎక్కువగా ఉండటం గమనించడం జరిగిందన్నారు. రసం పీల్చే పురుగులు తామర పురుగులు , ఎర్రనల్లి తెల్ల దోమ గమనించటం జరిగింది దీని నివారణకు రైతులు బు బులుగు, పసుపు, తెలుపు జిగురటలో ఎకరాకు 30 నుంచి 40 వరకు ఉంచినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉదృత్తి బట్టి పురుగుమందులు పిచ్చికారి చేసుకోవాలన్నారు. వేప నూనె 10,000 పిపిఎమ్ లీటర్ నీటికి 1 ఎం ఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహాయకులు వి. ఖాదర్ భాషా, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.