మున్సిపల్ పరిధిలోని రూములకు దరఖాస్తు చేసుకోవాలి - కే అనూష
BSBNEWS - కందుకూరు
కందుకూరు పురపాలక సంఘము పరిధిలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక వైపు షెడ్యూల్ కులములు సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు 10 షాప్ రూములను నిర్మించి షెడ్యూల్డ్ కులముల వారికి కేటాయించి ఇవ్వడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కె అనూష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాటిలో 8, 9 షాపు రూముల వారు మరణించినందున ప్రస్తుతం ఆరెండు షాపు రూములు ఖాళీగా ఉన్నాయన్నారు. సదురు రెండు షాపులను ఏపీఎస్ సిసి ఎఫ్సి లిమిటెడ్ వారి నియమ నిబంధనల మేరకు షెడ్యూల్ కులముల వారికి కేటయించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు అప్లికేషన్స్ కోరడమైనదన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయమునకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె తెలిపారు.