మాకు న్యాయం చేయండి సారూ..
పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన మృతుని బంధువులు
పోలీస్ స్టేషన్ లోనే చర్చలు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని మహదేవపురం అడ్డరోడ్డులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలకు వెళ్తే పట్టణంలోని నాంచారమ్మ కాలనీకి చెందిన కాలం నరసింహ రావు (55) మహాదేవపురం రోడ్డులో ఉన్న వైన్స్ లో రోజు కూలీగా పని చేస్తూ ఉండేవాడు. అయితే శుక్రవారం తన పనిని ముగించుకొని సైకిల్ పై వస్తుండగా సింగరాయకొండ నుండి కందుకూరు కి వస్తున్న కారు ఢీ కొట్టింది. దాంతో అక్కడ ఉన్న స్థానికులు నరసింహంను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నరసింహ బంధువులు ఏరియా వైద్యశాలకు చేరుకొని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దాంతో నరసింహ కుటుంబ సభ్యులు కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఢీ కొట్టిన కారు పట్టణంలోని కోవూరు రోడ్డు లో ఒక హోటల్ యజమాని కారుగా గుర్తించారు. ఆ కారులో హోటల్ యజమాని దంపతులు కావలికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే కారు యజమాని పై నరసింహ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని శనివారం నరసింహ మృతదేహాన్ని కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి స్టేషన్ ఎదుట బైఠాయించారు. దాంతో కారు యజమాని పై కేసు నమోదు చేయడం జరిగిందని మీకు న్యాయం చేస్తామని కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్రా నాయక్ చెప్పడంతో నరసింహ కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు. అయితే పోలీస్ స్టేషన్లోనే ఇరువురిని కూర్చోబెట్టి చర్చలు పెట్టడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ వివరణ
జరిగిన సంఘటనపై కందుకూర్ రూరల్ ఎస్సై మహేంద్రా నాయక్ ఎవరైనా కోరగాప్రమాదం జరిగిన విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నామని చెప్పడం గమనార్హం.