అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
- ఎస్పీ ఏ ఆర్ దామోదర్
BSBNEWS - ఒంగోలు
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా పురుష అభ్యర్థులు 267 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్ నియామక పక్రియలో భాగంగా జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్ధులకు పి.ఎం.టి, పి.ఈ.టి పరీక్షలు మంగళవారం జిల్లా పోలీసు మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఎత్తు,ఛాతీ కొలత వంటి ఫిజికల్ మెజర్‌మెంట్‌లు చేయబడతాయని ఆయన తెలిపారు.దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ వంటి అంశాలను ఆధునిక ఆర్ ఎఫ్ ఐ డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిర్వహించారు. 361 మంది అభ్యర్దులు దేహ దారుఢ్య పరీక్షలకు హజరయ్యారు. వీరిలో 267 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారు. అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సూచనల మేరకు కాల్ లెటర్ లో తెలిపిన అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించిన ఒక సెట్టు జిరాక్స్ కాపీలు తో హాజరుకావాలని ఆయన సూచించారు. అప్పీల్ చేయదలచిన అభ్యర్థులు ఈ నెల 10 న జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో తమ అప్పీల్ అందించవచ్చని ఆయన చెప్పారు.ఎవరైతే కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను ఆధారంగా చేసుకుని టెస్టులకు హాజరవ్వాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ ఆరోగ్య పరిస్థికి అనుగుణంగా పరీక్షలలో పాల్గొనవల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె.నాగేశ్వరరావు, ఎస్బి డిఎస్పీ సురేష్ బాబు, దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, పిటిసి డిఎస్పీ మాధవ రెడ్డి, పిటిసి డిఎస్పీ లక్ష్మణ్ కుమార్, డీపీఓ ఏ ఓ రామ్మోహన్ రావు, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, డీటీసీ సీఐ షేక్ .షమీముల్లా, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి,షేక్ ఖాసీం, ఎస్సైలు, డీపీఓ సిబ్బంది, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.