దళిత బిడ్డలు చదువు దూరం చేయొద్దు
ఎంపీపీ స్కూల్ ను కొనసాగించాలి
సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు వినతి
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని పోలినేని పాలెం గ్రామం ఎస్సీ మాదిగ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పోలినేని పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేయాలని ఎస్ఎంసి చైర్మన్ గాజులవర్తి సౌజన్య అన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ సౌజన్య మాట్లాడుతూ పోలినేని పాలెం ఎస్సీ మాదిగ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పోలినేనిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలని ఆమె కోరారు. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయటం వలన చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వర్షాకాలంలో వాగును దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, మధ్యలో స్మశానం కూడా ఉందని, రోడ్డు ప్రక్కనే శవాలను కూడా తగలబెడుతుంటారని, చిన్నపిల్లలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. దళిత బిడ్డలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్కూలు వెనుక ఉన్న ఎస్టీ కాలనీ నుండి ఎస్సీ మాదిగ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు 10 మంది ఎస్టి విద్యార్థులు వస్తుంటారని, నిరుపేద విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని వాపోయారు. కూలి పనులు చేసుకుంటూ జీవించే దళితులు ఎస్సీ మాదిగ కాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లి పిల్లలను సంరక్షించే పరిస్థితి తల్లిదండ్రులకు ఉండదన్నారు. తక్షణం ప్రభుత్వం వారు పునరాలోచించి ఎస్సీ మాదిగ కాలనీలోని స్కూలును ఇక్కడే కొనసాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు.