అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే

bsbnews
0

 అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే

194 వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళి.

BSBNEWS - కందుకూరు 

అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారత తొలి ఉపాధ్యాయిని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. స్థానిక లాయర్ ముప్పవరపు కిషోర్ కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో శూద్రులకు విద్య నిరాకరిస్తున్న కాలములో అందున మహిళలు మరింత అణిచివేత గురై రెండవ తరగతి శ్రేణులుగా చూడబడుతున్న రోజుల్లో తన భర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే వద్ద విద్య అభ్యసించిందన్నారు. పూలే గొప్ప సంఘసంస్కర్త అని, ఆయనతో పాటు ఆమె కూడా స్త్రీ విద్య కోసం తపించారన్నారు. మహిళలు విద్యాదికులుగా చేయాలని ఆమె కృషి చేశారన్నారు. సమాజం ముందుకు నడవాలంటే సమాజంలో సగం ఉన్న మహిళలంతా చదువు కోవాలని ఆమె ఆశించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయునిగా వెళుతున్న కాలంలో అవమానాలను, అణిచివేతలను ఎదుర్కొని బహిష్కరణలకు గురయ్యారన్నారు.  వీటన్నిటినీ ఎదుర్కొని అణగారిన మహిళలకు, ప్రజలకు ఆశాజ్యోతిగా నిలబడ్డారన్నారు. జ్యోతిరావు పూలే సహకారంతో తనను తాను అకుంఠ దీక్షతో సమాజంలో మార్పులు రావాలని సమాజం ముందుకు నడవాలంటే మహిళా విద్య అవసరమని చెప్పిన ఉపాధ్యాయుని, తొలి గురువు సావిత్రిబాయి పూలే అని అన్నారు. సాంఘిక సమానత్వం కోసం, స్త్రీ విద్య కోసం కుల పీడన కు వ్యతిరేకంగా, పితృ సామ్యానికి  వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిభాయి పూలే అని,  సావిత్రిబాయి పూలేని సదా మనం గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో దమ్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు ఉపాసక గాండ్ల హరిప్రసాద్, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్, ప్రముఖ బుద్ధిష్ట్ పోకూరి కోటయ్య, షైన్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ రహీం, ఎ. ఎ. డి మాజీ అధ్యలుక్షు గేరా. చిరంజీవి, డాక్టర్ రాయ్, గోచిపాతల. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)