స్ఫూర్తిదాయకం గాంధీజీ పోరాటం

bsbnews
0

 స్ఫూర్తిదాయకం గాంధీజీ పోరాటం

BSBNEWS - Nellore
సత్యం, ధర్మం, అహింస, సత్యాగ్రహం వంటి ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్ముడు గాంధీజీ అని, ఆయన చూపిన శాంతిమార్గంలో మనమందరం నడవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌ అన్నారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యావత్‌ భారతావనికి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన జాతి మార్గదర్శకుడు గాంధీజీ అని అన్నారు. ప్రతిఒక్కరూ మన జాతిపిత అనుసరించిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో పయనించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో జె ఉదయభాస్కర్‌రావు, కలెక్టరేట్‌ ఎవో విజయ్‌కుమార్‌, డిడి ఐఅండ్‌పిఆర్‌ సదారావు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)