మంత్రి నారాయణని కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - NELLORE
రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు లు వారి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కల్లూరి వెంకటేశ్వర్లు ఇతర నేతలు పాల్గొన్నారు.